పెరిగిన బంగారం, వెండి ధరలు

- August 10, 2016 , by Maagulf
పెరిగిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ప్రభావంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు జోరుగా పెరిగాయి. దీంతో బుధవారం పసిడి ధర రూ. 31వేల పైకి చేరగా.. వెండి కూడా ఒక్క రోజే రూ. వెయ్యికి పైగా పెరిగి 47వేల మార్కును దాటింది.
బులియన్‌ మార్కెట్లో బంగారం ధర నేడు రూ. 310 పెరిగింది. దీంతో పది గ్రాముల పసిడి రూ. 31,280గా ఉంది. అంతర్జాతీయంగా 1.1శాతం పెరిగి.. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 1,355.41 డాలర్లుగా ఉంది. వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. ఒక్క రోజే రూ. 1,050 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,350కు చేరింది.
నగల వ్యాపారులు, నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధరలు పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com