ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్‌దేవ్ యోగాభ్యాసం
- June 20, 2026
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని చారిత్రాత్మక ఉండవల్లి గుహల వద్ద ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ యోగాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలో యోగా ప్రదర్శనలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో యోగా సాధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పతంజలి యోగా గురుకులం విద్యార్థులు వివిధ యోగాసనాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
విద్యార్థుల యోగా ప్రదర్శనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తిగా తిలకించారు. వారి ప్రతిభను అభినందిస్తూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు, యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరమని, రాష్ట్రంలో యోగా సాధనను మరింత విస్తృతంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
ప్రకృతి సోయగాల నడుమ, చారిత్రాత్మక ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన ఈ యోగాంధ్ర కార్యక్రమం విశేషంగా ఆకట్టుకోగా, యోగా దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చ
- దుబాయ్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







