ఇకె 521 ప్రయాణీకులకు 7,000 డాలర్ల కాంపన్సేషన్‌

- August 10, 2016 , by Maagulf
ఇకె 521 ప్రయాణీకులకు 7,000 డాలర్ల కాంపన్సేషన్‌

ఎమిరేట్స్‌ విమానం ఇకె 521 ప్రమాదవశాత్తూ క్రాష్‌ ల్యాండ్‌ అయిన ఘటనలో ప్రయాణీకులందరికీ కాంపెన్సేషన్‌ కింద 7,000 డాలర్లను అందించనున్నట్లు సమాచారం అందించారు. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ నుంచి మెయిల్‌ ద్వారా ఈ సమాచారం తమకు అందినట్లు ఆ రోజు విమానంలో ఇద్దరు పిల్లలు, భార్యతోపాటు ప్రయాణించిన ఓ వ్యక్తి వెల్లడించారు. ఎయిర్‌లైన్‌ సంస్థ ఇంత త్వరగా ఈ చర్యలు చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆ దుర్ఘటన నుంచి తృటిలో ప్రాణాలు దక్కించుకోవడం చాలా అద్భుతమని ఆయన అన్నారు. ఆగస్ట్‌ 3న బోయింగ్‌ 777 ఎయిర్‌ క్రాఫ్ట్‌ దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదవశాత్తూ క్రాష్‌ ల్యాండ్‌ కాగా, అందులోని మొత్తం ప్రయాణీకులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఓ ఫైర్‌ ఫైటర్‌ మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఆయన త్యాగానికి గుర్తుగా సివిల్‌ డిఫెన్స్‌ ట్రైయినింగ్‌ వింగ్‌లో ఓ హాల్‌కి అతని పేరుని పెట్టారు. మృతి చెందిన ఫైర్‌ ఫైటర్‌ పేరు అల్‌ బలౌషి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com