జాతీయ జెండాని ఎగరవేసేందుకు రానున్న భారత రాయబారి
- August 10, 2016
కతార్: భారతదేశం యొక్క 70 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ వేడుకని ఆగష్టు 15 వ తేదీ ఉదయం 7 గంటలకు ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐ సి సి ) ఆధ్వర్యంలో జరుపుకోనున్నారు భారత రాయబారి సంజీవ్ అరోరా కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసే మరియు భారత రాష్ట్రపతి ప్రసంగ పాఠాన్ని అందరకి చదివి వినిపిస్తారు.దోహా లోని భారతీయ పాఠశాలల్లో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని భారత రాయబార కార్యాలయం బుధవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.జాతీయ పతాకావిష్కరణ వేడుకకు భారతీయ జాతీయులు అందరూ హాజరుకావాలని దౌత్యకార్యాలయం ఆహ్వానించింది, ఈ కార్యక్రమానికి వచ్చే వారందరు తమ వెంట ఒక ఫోటో గుర్తింపు పత్రం కూడా తీసుకునిరావాలని ఈ సందర్భంగా దౌత్య కార్యాలయం అధికారులు అభ్యర్థించారు.వీధి నెంబర్ 916 లో ఉన్న వాహబ్ బిన్ ఆమిర్ , అల్ మమౌర ఐసీసీ ప్రాంగణంలో జరిగే ఈ వేడుకలో ఫలహారాలు కార్యక్రమ సమయంలో వడ్డిస్తారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







