పాకిస్తాన్ లో మరో పేలుడు, 13 మందికి గాయాలు
- August 11, 2016
పాకిస్థాన్‌లో గురువారం ఉదయం మరోసారి బాంబు పేలుడు సంభవించింది. క్వెట్టా నగరంలోని అల్‌ఖైర్ ఆస్పత్రి వద్ద పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ధాటికి 13 మంది గాయపడినట్లు సమాచారం. ఆస్పత్రి ఆవరణలోని ఓ వంతెన కింద బాంబు అమర్చి ఉంటారని బెలూచిస్థాన్ హోంమంత్రి మీర్ సర్ఫరాజ్ బుగ్తి పేర్కొన్నారు. బెలూచిస్థాన్ ఫెడరల్ న్యాయస్థానం జడ్జి జహూర్ శివానీ లక్ష్యంగా ఈ పేలుడుకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం ఇదే నగరంలోని సివిల్ ఆస్పత్రిలో జరిగిన పేలుళ్లలో 70 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







