న్యాయవ్యవస్థని లక్ష్యంగా చేసుకొన్న వార్తాపత్రికని ఒమన్ ప్రభుత్వం మూసివేసింది

- August 11, 2016 , by Maagulf
న్యాయవ్యవస్థని  లక్ష్యంగా చేసుకొన్న వార్తాపత్రికని ఒమన్ ప్రభుత్వం మూసివేసింది

మస్క్యాట్: ఒమాని ప్రభుత్వంకు అనుకూలంగా  కేసు తీర్పు మార్చడానికి న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొని రావడమే కాక ప్రభుత్వంలో  ఉన్నతాధికారులని  నిందిస్తూ రెండు నివేదికలు ప్రచురించటంతో అజాంన్  వార్తాపత్రిక కార్యాలయాలని తక్షణమే  మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛని ఆ వార్తాపత్రిక ఉల్లంఘించినట్లు, ప్రభుత్వం ఓ ఎన్ ఏ  ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ద్వారా ఒక ప్రకటనలో తెలిపింది." భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పునాదులను పట్టించుకోకుండా తప్పుడు నివేదిక మాత్రమే ప్రచురించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకానొక కీడుని వ్యవస్థకు ఆపాదించడం సరికాదని ఒక పద్ధతిలో పత్రికా విలువలని అటువంటి రాతలు దిగజారుస్తుందని ముఖ్యంగా న్యాయ సంస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తీవ్రమైన చర్య అని ఒక  ప్రకటన తెలిపారు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com