సంపన్న టెక్ దిగ్గజాల జాబితాలో ఇద్దరు భారతీయులు
- August 11, 2016
ప్రపంచంలో సంపన్నులైన తొలి వంద మంది టెక్నాలజీ దిగ్గజాల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. వీరిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ సహ వ్యవస్థాపకులు శివ్ నాడార్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. '100 రిచెస్ట్ టెక్ బిలియనీర్స్ ఇన్ ద వరల్డ్ 2016' జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ 78బిలియన్ల డాలర్ల ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. అజీమ్ ప్రేమ్‌జీ 16 బిలియన్ డాలర్ల ఆస్తితో ఈ జాబితాలో 13వ స్థానం దక్కించుకున్నారు. శివ్ నాడార్ 11.6 బిలియన్ డాలర్ల ఆస్తితో 17వ స్థానంలో ఉన్నారు.
ఇండో-అమెరికన్లు అయిన సింఫొనీ టెక్నాలజీ గ్రూప్ సీఈఓ రొమేశ్ వాధ్వాని, ఐటీ కన్సల్టింగ్ కంపెనీ సింటెల్ వ్యవస్థాపకులు భరత్ దేశాయ్, ఆయన భార్య నీర్జా దేశాయ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. గూగుల్ అల్ఫాబెట్ ఛైర్మన్ ఎరిక్ ష్మిత్, ఉబర్ సీఈఓ ట్రావిస్ కలనిక్‌లు జాబితాలో టాప్ 20లో ఉన్నారు. సంపన్న టెక్ దిగ్గజాల జాబితాలో అత్యధికంగా దాదాపు సగం మంది అమెరికాకు చెందిన వారు ఉన్నారు. తొలి పది మందిలో ఎనిమిది మంది అమెరికా వారే. తర్వాత స్థానాల్లో చైనాకు చెందిన వారు 19 మంది ఉన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







