ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!
- June 25, 2026
మనామా: ఈ జూలైలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధిపై ఉన్నత-స్థాయి సమావేశం జరగనున్నది. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధి మంత్రిత్వ శాఖ బహ్రెయిన్ తన మూడవ స్వచ్ఛంద జాతీయ సమీక్ష (VNR)ను ఐక్యరాజ్యసమితి వెబ్సైట్లో పబ్లిష్ కోసం సమర్పించింది. సుస్థిర అభివృద్ధి మంత్రి మరియు బహ్రెయిన్ ఆర్థిక అభివృద్ధి బోర్డు (EDB) సీఈఓ నూర్ బింట్ అలీ అల్ఖులైఫ్ మాట్లాడుతూ.. 2030 లక్ష్య తేదీకి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ప్రాంతీయ సవాళ్లు ఉన్నప్పటికీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (SDGలు) ముందుకు తీసుకెళ్లడానికి బహ్రెయిన్ కట్టుబడి ఉందని అన్నారు. హీజ్ మెజెస్టీ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో మరియు యువరాజు, ప్రధానమంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా మార్గదర్శకత్వంలో బహ్రెయిన్ తన సమగ్ర అభివృద్ధి మోడల్ ను బలోపేతం చేస్తూనే ఉందని పేర్కొన్నారు.
17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (SDGలను) తన జాతీయ అభివృద్ధి అజెండాలో చేర్చి, బహ్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలను ప్రముఖంగా తెలియజేసింది. ఇది విద్య, ఆరోగ్య సంరక్షణ, సామాజిక మద్దతు, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ చర్యలు, ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన, మరియు సమ్మిళిత ఆర్థిక వృద్ధి వంటి రంగాలలో సాధించిన పురోగతిని వివరించింది. బహ్రెయిన్ గతంలో 2018 మరియు 2023లో స్వచ్ఛంద జాతీయ సమీక్షలను సమర్పించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGల) అమలు, ఆర్థిక పునరుద్ధరణకు మద్దతు, డిజిటల్ పరివర్తనను ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలలో సాధించిన పురోగతిని తాజా సమీక్ష నివేదికలో వివరించారు.
తాజా వార్తలు
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







