కువైట్‌లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- June 26, 2026
కువైట్: కువైట్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిరంతరం తనిఖీలు, కఠిన చర్యల కారణంగానే కేసుల సంఖ్య తగ్గుతుందని కువైట్ న్యాయశాఖ మంత్రి, కౌన్సిలర్ నాసర్ అల్-సుమైత్ అన్నారు. మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల చట్టాన్ని తిరిగి రూపొందించి, సమీక్షించడానికి కౌన్సిలర్ మహమ్మద్ అల్-దువాజ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీని ఫలితంగా, అక్రమ రవాణాదారులకు విధించే శిక్షలను కఠినతరం అవుతుందన్నారు. రసాయన సమ్మేళనాలను ఉపయోగించి తక్కువ ఉత్పత్తి వ్యయంతో మరియు సులభంగా తయారు చేయగలగడం వల్ల సైకోట్రోపిక్ పదార్థాలు అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా మారాయని మంత్రి పేర్కొన్నారు.
ప్రధాన సవరణలు
సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ రవాణాకు విధించే శిక్షలను గణనీయంగా పెంచారు. గత చట్టం 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించగా, సవరించిన ఈ చట్టం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరణశిక్షను కూడా అనుమతిస్తుంది. అల్-సుమైత్ ప్రకారం, ఈ కఠినమైన చట్టం ప్రభావం కేవలం మూడు నెలల్లోనే స్పష్టంగా కనిపించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నేరాలు 44 శాతం తగ్గాయి.అధికారుల కృషి ఫలితంగా కువైట్‌లో కొన్ని రకాల మాదకద్రవ్యాల చలామణి 80 శాతం తగ్గిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా నివేదించిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







