కృష్ణా పుష్కరాల సమయంలో మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు: కొల్లు రవీంద్ర
- August 11, 2016
అత్యంత పవిత్రంగా జరుపుకొనే కృష్ణా పుష్కరాల్లో మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు పుష్కరఘాట్ల వద్ద 24 గంటల పాటు 792 మంది ఎక్సైజ్ సిబ్బందితో పూర్తి నిఘా ఏర్పాటుచేసినట్లు చెప్పారు. 12 రోజుల పాటు చెక్‌పోస్టుల వద్ద తమ శాఖ సిబ్బంది నిరంతరం తనిఖీలు చేస్తారని తెలిపారు. ఘాట్ల వద్ద కంట్రోల్ రూం ఏర్పాటుచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూస్తామన్నారు. పుష్కర పరిసర ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు, గొడవలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!









