కృష్ణా పుష్కరాల సమయంలో మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు: కొల్లు రవీంద్ర

- August 11, 2016 , by Maagulf
కృష్ణా పుష్కరాల సమయంలో మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు: కొల్లు రవీంద్ర

అత్యంత పవిత్రంగా జరుపుకొనే కృష్ణా పుష్కరాల్లో మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు పుష్కరఘాట్ల వద్ద 24 గంటల పాటు 792 మంది ఎక్సైజ్‌ సిబ్బందితో పూర్తి నిఘా ఏర్పాటుచేసినట్లు చెప్పారు. 12 రోజుల పాటు చెక్‌పోస్టుల వద్ద తమ శాఖ సిబ్బంది నిరంతరం తనిఖీలు చేస్తారని తెలిపారు. ఘాట్ల వద్ద కంట్రోల్‌ రూం ఏర్పాటుచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చూస్తామన్నారు. పుష్కర పరిసర ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు, గొడవలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com