కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- July 06, 2026
కువైట్ : కువైట్‌లోని జబ్రియా ప్రాంతంలో ఆదివారం రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల నివాస భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. అందులో నివసించే నలుగురు లోపల చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు వేగంగా స్పందించి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి.
జబ్రియాలోని ఓ నివాస భవనం పైకప్పు కూలిపోయి పలువురు చిక్కుకుపోయారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆపరేషన్స్ రూమ్‌కు సమాచారం అందిందని, వెంటనే హవల్లీ, సల్మియా అగ్నిమాపక కేంద్రాల నుంచి బృందాలను సంఘటనా స్థలానికి తరలించినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదం మరింత పెరగకుండా ముందుజాగ్రత్త చర్యగా భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయించినట్లు పేర్కొంది.
అయితే, రక్షించబడిన వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అలాగే పైకప్పు కూలిపోవడానికి గల కారణం కూడా ఇంకా తెలియరాలేదు. నిర్మాణ లోపమా? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అనంతరం ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!







