యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- July 08, 2026
జెడ్డా: విదేశాంగ మంత్రిత్వ శాఖలో యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడానికి సౌదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దౌత్య, సర్వీస్ మరియు ప్రత్యేక పాస్‌పోర్ట్‌లు కలిగిన వారికి వీసా మినహాయింపుపై సౌదీ అరేబియా మరియు హంగేరి, కజకిస్తాన్, పోలాండ్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. జెడ్డాలో జరిగిన కేబినెట్ సమావేశానికి క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా చేపట్టిన కార్యకలాపాలను కేబినెట్ సమీక్షించింది.
ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక వారోత్సవాల్లో సౌదీ ప్రతినిధి బృందం చురుకుగా పాల్గొనడాన్ని క్యాబినెట్ ప్రశంసించిందని మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరి తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, దాని మూలాలను నిర్మూలించడానికి, దాని ఆర్థిక వనరులను అరికట్టడానికి, ఉగ్రవాద ముప్పులను ఎదుర్కొనే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సంస్థలు మరియు సంబంధిత సంస్థలతో సహకారానికి సౌదీ తన నిబద్ధతను పునరుద్ఘాటించడాన్ని ఆయన ప్రశంసించారు.
సైబర్ సెక్యూరిటీలో మహిళలకు సాధికారత కల్పించడంపై సౌదీ నేతృత్వంలోని తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తన 62వ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని క్యాబినెట్ స్వాగతించింది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ జారీ చేసిన 2026 ఐసిటి అభివృద్ధి సూచికలో సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలవడం, సౌదీలో డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు నియంత్రణ వాతావరణం అభివృద్ధి చెందడాన్ని, అలాగే టెక్నాలజీ మరియు ఏఐలో దాని పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని క్యాబినెట్ పేర్కొంది.అరబ్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సౌదీ అరేబియా వరుసగా రెండోసారి ఎన్నిక కావడం, ప్రాంతీయంగా మరియు అంతర్జాతీయంగా విమానయాన రంగానికి మద్దతు ఇవ్వడంలో సౌదీ పోషిస్తున్న టాప్ రోల్ ను, అలాగే వాయు రవాణా పరిశ్రమ అభివృద్ధికి అందజేస్తున్న సహకారాన్ని ప్రతిబింబిస్తుందని క్యాబినెట్ పేర్కొంది.
విద్యారంగంలో సౌదీ అరేబియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌ను ప్రపంచ బ్యాంకు ప్రశంసించడాన్ని క్యాబినెట్ అభినందించింది. ఇకా ఈ సమావేశంలో పలు వ్యూహాత్మక మరియు కీలక రంగాలలో పనితీరు సూచికలను క్యాబినెట్ సమీక్షించింది. లాభాపేక్ష లేని సంస్థల రంగం తన అభివృద్ధి లక్ష్యాల దిశగా సాధిస్తున్న నిరంతర పురోగతిని క్యాబినెట్ ప్రశంసించింది. అణు మరియు రేడియోలాజికల్ నియంత్రణ రంగాలలో సమాచార మార్పిడికి సంబంధించిన ముసాయిదా అవగాహన ఒప్పందంపై కెనడియన్ అణు భద్రతా కమిషన్‌తో చర్చించి, సంతకం చేసేందుకు అణు మరియు రేడియోలాజికల్ నియంత్రణ కమిషన్ ఛైర్మన్‌కు లేదా ఆయన డిప్యూటీకి క్యాబినెట్ అధికారం ఇస్తూ..కేబినెట్ ఉత్తర్వులను జారీ చేసినట్లు మీడియా మంత్రి సల్మాన్ అల్-దోసరి తెలిపారు.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







