యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- July 13, 2026
అబుదాబి: ఖతార్ మాజీ అమీర్, ప్రస్తుత ఖతార్ అమీర్ తండ్రి అయిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణానికి సంతాపంగా యూఏఈ నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలను ప్రకటించింది. జులై 15 (బుధవారం) వరకు ఈ సంతాప దినాలు అమలులో ఉంటాయని యూఏఈ ప్రెసిడెన్షియల్ కోర్ట్ వెల్లడించింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, అధికారిక సంస్థలతో పాటు విదేశాల్లోని యూఏఈ రాయబార కార్యాలయాలు (ఎంబసీలు), దౌత్య కార్యాలయాలపై జాతీయ జెండాలను సగం ఎత్తులోనే ఎగురవేయనున్నారు.
ఖతార్ ఫాదర్ అమీర్ మరణం పట్ల యూఏఈ తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ, ఖతార్ రాజకుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది.
ఇప్పటికే కువైట్ కూడా తమ దేశంలో నాలుగు రోజుల అధికారిక సంతాప దినాలను ప్రకటించగా, ఖతార్ ప్రభుత్వంజులై 12 నుండి నాలుగు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఖతార్‌లో జులై 13 నుండి ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులందరూ తిరిగి జులై 19 (ఆదివారం) న విధుల్లో చేరనున్నారు. లూసైల్ స్మశానవాటికలో షేక్ హమద్ అంత్యక్రియలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్‌లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







