యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!

- July 14, 2026 , by Maagulf
యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!

అబుదాబి: గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈలోని అమెరికా దౌత్య కార్యాలయాలు మూడు రోజుల పాటు కాన్సులర్ అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా రద్దు చేశాయి. అమెరికా రాయబార కార్యాలయం (అబుదాబి), అమెరికా కాన్సులేట్ జనరల్ (దుబాయ్)లు జూలై 13 నుంచి 15 వరకు కాన్సులర్ అపాయింట్‌మెంట్లను రద్దు చేసినట్లు ప్రకటించాయి.

ప్రాంతీయ భద్రతా పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ తేదీల్లో అపాయింట్‌మెంట్ ఉన్నవారు రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌కు రావద్దని సూచించారు. వారి అపాయింట్‌మెంట్లను తిరిగి షెడ్యూల్ చేసేందుకు సంప్రదించాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com