బాలాదిత్య పెళ్లి వేడుక

- August 13, 2016 , by Maagulf
బాలాదిత్య పెళ్లి వేడుక

బాలనటుడిగా కెరీర్‌ను ప్రారంభించి హీరోగా మంచి సినిమాలు చేసిన బాలాదిత్య ఓ ఇంటివాడయ్యాడు. జూబ్లీహిల్స్‌లోని తాజ్‌మహల్‌ హోటల్‌లో బాలాదిత్య పెళ్లి వేడుక జరిగినట్లు నటుడు శివబాలాజీ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. పెళ్లి వేడుకలో నూతన దంపతులతో కలిసి దిగిన ఫొటోను శివబాలాజీ పోస్ట్‌ చేస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు.
'ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం' సినిమాతో బాలనటుడిగా సినీ రంగానికి పరిచయమైన బాలాదిత్య 'అన్న', 'లిటిల్‌సోల్జర్స్‌', 'బంగారు బుల్లోడు', 'హిట్లర్‌', 'అబ్బాయిగారు', 'ఏవండీ ఆవిడ వచ్చింది', 'హలో బ్రదర్‌' వంటి చిత్రాల్లో నటించారు. చంటిగాడు చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసి రూమ్‌ మేట్స్‌, 1940లో ఒక గ్రామం తదితర చిత్రాల్లో నటించారు. ఇంతేకాదు బాలాదిత్య డబ్బింగ్‌ కళాకారుడిగా, వ్యాఖ్యాతగా, గేయరచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com