సిరియా వార్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నవారిని అడ్డుకున్న సౌదీ
- August 13, 2016
సౌదీ అరేబియా, లెబనాన్ ద్వారా సిరియాకి వెళ్ళి అక్కడి తీవ్రవాద సంస్థల్లో చేరాలనుకున్న ముగ్గురు మహిళలు, ఏడుగురు పిల్లల్ని అడ్డుకున్నట్లు వెల్లడించింది. ముగ్గురు సోదరీమణులు, వారికి చెందిన పిల్లలు లెబనీస్ అధికారులకు బీరట్‌లో పట్టుబడ్డారు. వారిని సౌదీ అరేబియాకి తిరిగి పంపించారు. వీరిలో ఒకరి భర్త, పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇస్లామిస్ట్ మిలిటెంట్స్ కోసం ఉపయోగించే 'తక్‌ఫిరి' పదాన్ని తన భార్యకు ఉపయోగిస్తూ ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. సిరియాకి పొరుగు దేశాల నుంచి పెద్దయెత్తున వెళుతున్నవారంతా అక్కడి తీవ్రవాద సంస్థలతో జతకడ్తున్నారు. దాంతో సిరియా రక్తసిక్తమవుతోంది, ప్రపంచానికి సవాల్ విసురుతోంది. గడచిన 18 నెలల్లో 31,000 మందిని వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి సిరియా తీవ్రవాద సంస్థల్లో రిక్రూట్ చేసుకున్నారనేది ఓ అంచనా.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







