పొల్యూషన్ రూల్స్‌ని అతిక్రమించిన 60 సంస్థలకు వార్నింగ్
- August 13, 2016
మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ మరియు ఎన్విరాన్‌మెంట్‌కి చెందిన ఇండస్ట్రియల్ ఇన్‌స్పెక్షన్ డిపార్ట్‌మెంట్, 60 కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. పొల్యూషన్ నిబందనల్ని అతిక్రమిస్తున్నట్లు ఈ హెచ్చరికల్లో పేర్కొన్నారు. ఏడాదికి రెండుసార్లు ఈ తనిఖీలు నిర్వహిస్తారు. కార్బన్ ఎమిషన్స్ ఏ స్థాయిలో గాల్లోకి విడిచపెట్టబడుతున్నాయో ఈ తనిఖీల్లో పరిశీలించి, నిబందనల్ని అతిక్రమించేవారికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఇంకో వైపున ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో 190 అనుమతుల్ని మంజూరు చేశారు. గత ఏడాది 600 అనుమతుల్ని మంజూరు చేశారు. చిన్న కంపెనీల విషయానికొస్తే, అంతర్గతంగా పరిస్థితుల్ని మాత్రమే పరిశీలిస్తామనీ, ఒక్కోసారి మిగతా అంశాల్నీ తనిఖీల్లో పరిశీలిస్తామని డైరెక్టర్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ అలి అబ్దుల్లా అల్ మర్రి చెప్పారు. 700 చిన్నస్థాయి కంపెనీలలో ఏడాదికి రెండుసార్లు ఖచ్చితంగా తనిఖీలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. అలాగే ప్రత్యేక తనిఖీలు కూడా అప్పుడప్పుడూ జరుగుతంటాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







