డౌన్‌టౌన్ దుబాయ్‌లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..

- July 17, 2026 , by Maagulf
డౌన్‌టౌన్ దుబాయ్‌లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..

దుబాయ్: డౌన్‌టౌన్ దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ వెలువడిన వార్తలను దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం (GDMO) ఖండించింది. ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్థ రియూటర్స్ ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.

ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో డౌన్‌టౌన్ దుబాయ్ ప్రాంతంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా కథనం ప్రచురించింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

దీనిపై స్పందించిన దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం, డౌన్‌టౌన్ దుబాయ్‌లో ఎలాంటి పేలుళ్ల ఘటన జరగలేదని, రాయిటర్స్ ప్రచురించిన సమాచారం వాస్తవాలకు విరుద్ధమని వెల్లడించింది.

ప్రజలు, మీడియా సంస్థలు అధికారిక వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని, ధృవీకరణ లేని వార్తలు, పుకార్లను ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జీడీఎంఓ విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com