ఉక్రెయిన్ ప్రధానిగా కోరెట్‌స్కీ...
- July 17, 2026
ఉక్రెయిన్: యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్ దేశంలో కీలక రాజకీయ మార్పు చోటుచేసుకుంది. ఉక్రెయిన్ నూతన ప్రధానమంత్రిగా 48 ఏళ్ల సెర్హి కోరెట్‌స్కీ (Serhiy Koretskyi) నియమితులయ్యారు. ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేసిన యూలియా స్థానంలో కోరెట్‌స్కీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఈ మేరకు ఆయనను కొత్త ప్రధానిగా ఎంపిక చేశారు.
రాజకీయ అనుభవం లేకపోయినా కీలక బాధ్యతలు
సెర్హి కోరెట్‌స్కీ ఇప్పటి వరకు ఉక్రెయిన్ ప్రభుత్వ ఇంధన సంస్థ (State Energy Company) చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విశేషం ఏమిటంటే, ఆయనకు రాజకీయాలతో గానీ, పార్లమెంట్‌తో గానీ ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేసిన అనుభవం కూడా లేదు. అయినప్పటికీ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో జెలెన్‌స్కీ ఆయనపై నమ్మకముంచారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన మూడో వ్యక్తిగా కోరెట్‌స్కీ నిలిచారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్‌లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవల్లో మార్పులు..







