ఒమన్‌లో ప్రవాస ఉద్యోగులకు కొత్త నిబంధన..!!
- July 17, 2026
మస్కట్: ఒమన్‌లో పనిచేస్తున్న నాన్-ఒమానీ ఉద్యోగులందరికీ సిక్ లీవ్, అసాధారణ సెలవు (Extraordinary Leave) బీమా తప్పనిసరి చేస్తూ సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన జూలై 19 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, అలాగే కార్మిక చట్టం పరిధిలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న అన్ని నాన్-ఒమానీ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. రాయల్ డిక్రీ (నం. 52/2023) ద్వారా షల్ ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వచ్చింది.
నూతన నిబంధనలోని ఆర్టికల్-1 ప్రకారం రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలోని ప్రభుత్వ విభాగాలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, కార్మిక చట్టం పరిధిలోని ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే అన్ని నాన్-ఒమనీ ఉద్యోగులకు ఈ బీమా తప్పనిసరి. ఆర్టికల్-2 ప్రకారం ఈ నిర్ణయానికి విరుద్ధంగా ఉన్న గత నిబంధనలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ నిర్ణయంపై ఇంజినీర్ సలీమ్ బిన్ నాసర్ బిన్ సయీద్ అల్ అవ్ఫీ, ఒమాన్ ఇంధన, ఖనిజాల మంత్రి మరియు సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ బోర్డు ఛైర్మన్ సంతకం చేశారు. కొత్త నిబంధనతో ఒమాన్‌లో పనిచేస్తున్న ప్రవాస ఉద్యోగులకు సామాజిక భద్రత మరింత బలోపేతం కానుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!
- భారత్–బహ్రెయిన్ భాగస్వామ్యం మరింత బలోపేతం..!!







