సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- July 19, 2026
దోహా:ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) పరిధిలోని శిక్షా, సంస్కరణ సంస్థల విభాగం తయారు చేసిన ఖైదీల ఉత్పత్తులను ఇకపై "సూమ్" (Sooum)** యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయం ఈరోజు నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.
ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలకు వృత్తి నైపుణ్యాలను ప్రోత్సహించడంతో పాటు, వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పేర్కొంది. అయితే, విక్రయానికి అందుబాటులో ఉండే ఉత్పత్తుల వివరాలు, వాటి ధరలు, డెలివరీ లేదా కొనుగోలు విధానం వంటి అంశాలను వెల్లడించలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సూమ్ యాప్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







