ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- July 20, 2026
దోహా: ఖతార్లో క్యాష్ లెస్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి. 2026 మే నెలకు సంబంధించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) తాజా గణాంకాల ప్రకారం.. కార్డ్ చెల్లింపులు, ఈ-కామర్స్, బ్యాంకు బదిలీలు, తక్షణ చెల్లింపు సేవలు (Instant Payments) అన్నింటిలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. వినియోగదారులు, వ్యాపార సంస్థలు డిజిటల్ చెల్లింపులను అధికంగా వినియోగిస్తుండటంతో దేశంలో డిజిటల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ మరింత బలపడుతోంది.
2026 మేలో కార్డ్ లావాదేవీల మొత్తం విలువ QR24.408 బిలియన్ కు చేరుకోగా, మొత్తం కార్డ్ ట్రాన్సాక్షన్ల సంఖ్య 72.344 మిలియన్లుగా నమోదైంది. ఇది రిటైల్ ఖర్చులు, ఎలక్ట్రానిక్ చెల్లింపులు నిరంతరం పెరుగుతున్నాయని సూచిస్తోంది. కార్డ్ ట్రాన్సాక్షన్ల సంఖ్య గత ఏడాది మేతో పోలిస్తే 24 శాతం పెరిగింది. 2025 మేలో 42.736 మిలియన్లుగా ఉన్న POS ట్రాన్సాక్షన్లు, 2026 మేలో 53.820 మిలియన్లకు పెరిగాయి. అలాగే POS లావాదేవీల విలువ QR8.547 బిలియన్ల నుంచి QR9.815 బిలియన్ లకు చేరుకుంది.
ఈ-కామర్స్ లావాదేవీలకు ఊపు
ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ సేవల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్ల సంఖ్య 9.449 మిలియన్ల నుంచి 12.615 మిలియన్లకు పెరిగింది. అయితే లావాదేవీల మొత్తం విలువ మాత్రం QR3.965 బిలియన్ నుంచి స్వల్పంగా తగ్గి QR3.909 బిలియన్ గా నమోదైంది.
ఇక ATM లావాదేవీల సంఖ్య 6.066 మిలియన్ల నుంచి 5.909 మిలియన్లకు తగ్గింది. అయినప్పటికీ విలువ పరంగా ATMల ద్వారా QR10.683 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ఇది ఇతర చెల్లింపు మార్గాల కంటే ఇప్పటికీ అత్యధిక విలువ కలిగిన విభాగంగా నిలిచింది. అలాగే, బ్యాంకు ఖాతాల మధ్య నిధుల బదిలీ కోసం ఉపయోగించే Tahweel ప్లాట్ఫామ్ ద్వారా జరిగిన బదిలీల మొత్తం విలువ QR64.241 బిలియన్ కు చేరి, గత ఏడాదితో పోలిస్తే 58 శాతం పెరిగింది. ట్రాన్సాక్షన్ల సంఖ్య 1.465 మిలియన్ల నుంచి 3.809 మిలియన్లకు చేరి 160 శాతం వృద్ధిని నమోదు చేసింది.
'ఫౌరన్' ఇన్స్టంట్ పేమెంట్స్కు ప్రజాదరణ
ఖతార్ ఇన్స్టంట్ పేమెంట్ ప్లాట్ఫామ్ Fawran వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరిగిన లావాదేవీల విలువ QR2.586 బిలియన్ నుంచి QR6.705 బిలియన్ కు పెరిగి 159 శాతం వృద్ధి సాధించింది. మే 2026 చివరి నాటికి ప్లాట్ఫామ్లో నమోదైన ఖాతాల సంఖ్య 3.858 మిలియన్లకు చేరడం, దేశంలో తక్షణ డిజిటల్ చెల్లింపుల సేవలపై పెరుగుతున్న ఆదరణను తెలియజేస్తోంది.
QCB గణాంకాల ప్రకారం.. డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాల విస్తరణ, ఫిన్టెక్ రంగంలో ఆవిష్కరణలు, వినియోగదారుల విశ్వాసం పెరగడం వల్ల ఖతార్లో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతోంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







