సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- July 20, 2026
రియాద్: సౌదీ అరేబియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా పెరుగుతోంది. కమ్యూనికేషన్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ కమిషన్ (CST) విడుదల చేసిన 'ఇంటర్నెట్ 2025' నివేదిక ప్రకారం.. సౌదీలో 45.2 శాతం ఇంటర్నెట్ వినియోగదారులు ఇప్పటికే AI టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. CST విడుదల చేసిన ఈ ఐదో వార్షిక నివేదికలో సౌదీ డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి, ఇంటర్నెట్ వినియోగ ధోరణులు, కొత్త సాంకేతికతల విస్తరణపై సమగ్ర విశ్లేషణ అందించింది.
నివేదిక ప్రకారం, సౌదీలో ఒక్కో వ్యక్తి నెలకు సగటున 53 జీబీ మొబైల్ ఇంటర్నెట్ డేటా వినియోగిస్తున్నాడు. ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. అలాగే, మొబైల్ ఇంటర్నెట్ మీడియం డౌన్లోడ్ వేగం 216 Mbpsగా నమోదైందని, ఈ సూచీలో సౌదీ అరేబియా జీ20 దేశాల్లో తొలి ఐదు స్థానాల్లో నిలిచిందని CST వెల్లడించింది.
సౌదీలోని 61.3 శాతం ఇంటర్నెట్ వినియోగదారులు రోజుకు ఏడు గంటలకు పైగా ఆన్లైన్లో గడుపుతున్నారని నివేదిక పేర్కొంది. ఇది ప్రజల దైనందిన జీవితంలో డిజిటల్ సేవల వినియోగం గణనీయంగా పెరిగినట్లు సూచిస్తోందని తెలిపింది. సోషల్ మీడియా, ప్రభుత్వ సేవలు, స్పోర్ట్స్, ఏఐ వంటి విభాగాల్లో అత్యధికంగా ఉపయోగిస్తున్న, ఎక్కువగా డౌన్లోడ్ చేసిన యాప్‌ల వివరాలను కూడా నివేదికలో పొందుపరిచింది.
వీటితోపాటు సౌదీ (.sa) డొమైన్ పేర్ల నమోదులో ఏడాదికి 18 శాతం వృద్ధి నమోదైందని, దేశీయ వెబ్సైట్లపై వినియోగదారుల విశ్వాసం పెరుగుతోందని CST పేర్కొంది. అత్యంత వేగంగా ఎదుగుతున్న యాప్‌లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ అలవాట్లు, ఎక్కువగా ఉపయోగిస్తున్న సెర్చ్ ఇంజిన్లు, సౌదీ డిజిటల్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి సంబంధించిన ఇతర కీలక సూచీలను కూడా ఈ నివేదికలో వెల్లడించింది.
డిజిటల్ సేవల సామర్థ్యాన్ని మరింత పెంచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో సౌదీ ఇంటర్నెట్ వ్యవస్థ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు CST వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







