దర్శకుడు హను రాఘవపూడి వివాహం ఈ నెల 26న..

- August 14, 2016 , by Maagulf
దర్శకుడు హను రాఘవపూడి వివాహం ఈ నెల 26న..

యువ దర్శకుడు హను రాఘవపూడి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అమూల్యతో ఈ డైరెక్టర్ వివాహం ఈ నెల 26న జరగనుంది. ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్న అమూల్యతో హను నిశ్చితార్థం గత మే నెలలో జరిగింది. ఆగస్టు 26న సిటీలోని ఫైవ్ స్టార్ హోటల్లో జరిగే ఈ వెడ్డింగ్‌కి పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది.'అందాల రాక్షసి', 'క్రిష్ణగాడి వీర ప్రేమగాధ' లాంటి సినిమాలు చేసి దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న హను రాఘవపూడి.. ప్రస్తుతం నితిన్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. అది పూర్తి కాగానే అఖిల్‌తో చేపట్టే ప్రాజెక్టుతో బిజీ అవుతాడట. ఈ మధ్యే మరో డైరెక్టర్ క్రిష్ కూడా డాక్టర్ అయిన రమ్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com