ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!

- July 22, 2026 , by Maagulf
ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!

దోహా: ఖతార్‌లోని ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ హోల్‌సేల్ సంస్థ అల్ రవాబీ హోల్‌సేల్ డివిజన్ వినియోగదారుల కోసం ‘షాప్ అండ్ విన్ – QR100,000 వర్త్ గిఫ్ట్స్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. మూడు నెలల పాటు సాగే ఈ ఆఫర్‌లో మొత్తం 100 మంది విజేతలకు QR100,000 విలువైన బహుమతులు అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అల్ రయ్యాన్‌లోని హోల్‌సేల్ ప్లస్ స్టోర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ అసోసియేట్ డైరెక్టర్ మొహమ్మద్ జసీల్ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు.

జూలై 15 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ కాలంలో అల్ రవాబీ హోల్‌సేల్ డివిజన్‌లో QR500 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్‌కు ఒక ఎలక్ట్రానిక్ రాఫిల్ కూపన్ లభిస్తుంది. విజేతలకు 10 ఐఫోన్ 17 ప్రో (256GB) స్మార్ట్‌ఫోన్లు, 20 బంగారు నాణేలు, 70 గిఫ్ట్ వౌచర్లు బహుమతులుగా అందజేయనున్నారు. ప్రతి నెలా రెండు లక్కీ డ్రాలు నిర్వహించి, చివరి నెలలో మెగా డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేయనున్నారు.

ఈ సందర్భంగా అల్ రవాబీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ..  వినియోగదారుల విశ్వాసానికి కృతజ్ఞతగా ఈ ప్రచారాన్ని తీసుకొచ్చామని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులు, మెరుగైన సేవలతో పాటు వినియోగదారులకు మరింత విలువను అందించడమే సంస్థ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com