హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- July 27, 2026
హైదరాబాద్: హైదరాబాద్ నగరంతో పాటు సైబరాబాద్ పరిధిలో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, ఐటి కారిడార్ ప్రాంతాల్లో వర్షం పడితే కిలోమీటర్ల మేర నిలిచిపోయే నరకప్రాయమైన ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ముందుస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఐటీ కంపెనీల యాజమాన్యాలకు పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. వర్షం సమయంలో ఒకేసారి అందరూ రోడ్లపైకి రాకుండా, ఉద్యోగులకు దశలవారీగా ‘ఎర్లీ లాగౌట్’ సౌకర్యం కల్పించాలని స్పష్టమైన సూచనలు చేశారు.
ఈ సారి వర్షాల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఉండేలా సైబరాబాద్ పోలీసులు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఐటీ (Hyderabad Rain Alert)సంస్థలు తమ ఉద్యోగులను ఏ సమయాల్లో ఎర్లీ లాగౌట్ చేస్తున్నారో ముందస్తుగా తమకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కంపెనీల వివరాలు, లాగౌట్ టైమింగ్స్ లభిస్తే, దానికి అనుగుణంగా ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం సులువవుతుందని స్పష్టం చేశారు. ఈ బృహత్తర యత్నంలో అన్ని ఐటీ కంపెనీలు తమకు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







