ప్రపంచ ఇంటెలిజెంట్ సిటీస్ జాబితాలో దోహా..!!
- July 30, 2026
దోహా: ప్రపంచంలోని అత్యంత ఇంటెలిజెంట్ నగరాల జాబితాలో దోహా నగరం చోటు దక్కించుకుంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) విడుదల చేసిన తొలి ఇంటెలిజెంట్ సిటీస్ ఇండెక్స్–2026లో దోహా "ఎమర్జింగ్ మెచ్యూరిటీ" విభాగంలో స్థానం సంపాదించింది. 39 దేశాలకు చెందిన 61 ప్రధాన నగరాలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో ఏఐ, డిజిటల్ సాంకేతికతలను ప్రజా సేవలు, ఆర్థికాభివృద్ధి, జీవన నాణ్యత మెరుగుదలకు నగరాలు ఎలా వినియోగిస్తున్నాయనే అంశాలను పరిశీలించారు.
నివేదిక ప్రకారం నగరాల పనితీరును ఫలితాలు (Outcomes), వ్యూహం (Strategy), సాంకేతిక వినియోగం (Adoption), పనితీరు విధానాలు (Ways of Working), మౌలిక వసతులు (Enablers) అనే ఐదు కీలక అంశాల ఆధారంగా అంచనా వేశారు. ఈ ప్రమాణాల ప్రకారం నగరాలను లీడింగ్, యాక్సిలరేటింగ్, ఎమర్జింగ్, డెవలపింగ్ అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.
ఈ ర్యాంకింగ్‌లో లండన్ అగ్రస్థానంలో నిలవగా, దుబాయ్ రెండో స్థానం దక్కించుకుంది. అనంతరం న్యూయార్క్, వాషింగ్టన్, ఆమ్‌స్టర్‌డామ్ స్థానాలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ సిటీ సేవలు, AI ఆధారిత పరిష్కారాల అమలులో దుబాయ్ ప్రపంచంలోనే నంబర్–1గా నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. అబుదాబి, రియాద్ నగరాలు యాక్సిలరేటింగ్ విభాగంలో చోటు సంపాదించాయి.
దోహా నగరం టోక్యో, హాంకాంగ్, మదీనా వంటి నగరాలతో కలిసి ఎమర్జింగ్ విభాగంలో నిలిచింది. AI వినియోగం పెరిగిన నగరాల్లో ప్రజల జీవన నాణ్యత కూడా మెరుగ్గా ఉంటుందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా మిడిలీస్టు, ఆసియా దేశాల ప్రజలు జనరేటివ్ AI వినియోగంపై అధిక ఆసక్తి, విశ్వాసం కనబరుస్తున్నట్లు వెల్లడించింది.
సాంకేతికత మాత్రమే కాకుండా ప్రతిభావంతులైన హ్యూమన్ రీసోర్స్, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలు, బలమైన డిజిటల్ మౌలిక వసతులు కూడా నగరాల అభివృద్ధికి కీలకమని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ సేవల్లో AI వినియోగాన్ని మరింత విస్తరించడం, డిజిటల్ పాలనను బలోపేతం చేయడం ద్వారా దోహా వంటి నగరాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశముందని నివేదిక సూచించింది.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ న్యూక్లియర్ సైన్స్ ఒలింపియాడ్–2026కు సౌదీ ఆతిథ్యం..!!
- ఒమన్‌లో 28 మంది ఆసియన్లు అరెస్ట్..!!
- 120 డేస్ సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలి.. కువైట్‌లో కొత్త చట్టం..!!
- సిమ్ కార్డుల కొనుగోలుపై బహ్రెయిన్ పోలీసుల వార్నింగ్..!!
- ప్రపంచ ఇంటెలిజెంట్ సిటీస్ జాబితాలో దోహా..!!
- ఏసీఐ వరల్డ్ లెవల్-5 అక్రెడిటేషన్ సాధించిన జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం
- హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం...
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్‌తో మరింత విస్తరించనున్న రవాణా వ్యవస్థ..
- ఆపదలో ఉన్న వేలాది మందికి అండగా GDRFA దుబాయ్..
- తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..







