ఒమన్‌లో 28 మంది ఆసియన్లు అరెస్ట్..!!

- July 30, 2026 , by Maagulf
ఒమన్‌లో 28 మంది ఆసియన్లు అరెస్ట్..!!

మస్కట్: ఒమన్‌లోకి సముద్ర మార్గం ద్వారా అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 28 మంది ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమాన్ పోలీసులు (ROP) తెలిపారు.

అల్ సీబ్ విలాయత్ తీరానికి సమీపంలో కోస్ట్ గార్డ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా.. ఓ పడవలో ప్రయాణిస్తున్న ఈ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరు అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించి వెంటనే అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన వారిపై ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.

దేశ భద్రత దృష్ట్యా ఒమాన్ తీరప్రాంతాల్లో కోస్ట్ గార్డ్ బృందాలు నిరంతరం సముద్ర గస్తీ నిర్వహిస్తూ, అక్రమ ప్రవేశాలు, మానవ అక్రమ రవాణా, ఇతర సముద్ర భద్రతా ఉల్లంఘనలను అడ్డుకుంటున్నాయని అధికారులు తెలిపారు. అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి ప్రజలు సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com