తెలంగాణ సంక్షేమ రంగంలో నెంబర్ వన్‌గా : కేసీఆర్
- August 14, 2016
సంక్షేమ రంగంలో తెలంగాణ నెంబర్ వన్‌గా దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహంగా ఉంటామని కేసీఆర్ అన్నారు. ఈ ఏడాది నుంచే బీసీలు, ఈబీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టామని, వారం రోజుల్లో 20 గురుకులాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. బాలారిష్టాలను ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే వర్సిటీ హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. నాలుగు నెలల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ తీసుకువచ్చే చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. పేద బ్రాహ్మణులకు బడ్జెట్లో రూ. 100 కోట్లు, చిన్న, సన్నకారు రైతులకు 100శాతం సబ్సిడీని కల్పించామన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు ఉంటాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









