కాశ్మీర్ అంశంపై చర్చలకు భారత్‌ను ఆహ్వానించిన పాక్

- August 15, 2016 , by Maagulf
కాశ్మీర్ అంశంపై చర్చలకు భారత్‌ను ఆహ్వానించిన పాక్

వివాదాస్పద కశ్మీర్‌ అంశాన్ని పాకిస్థాన్‌ మరోసారి లేవనెత్తింది. కశ్మీర్‌ అంశంపై చర్చించేందుకు భారత్‌ను ఆహ్వానించింది. ఈ మేరకు పాక్‌ విదేశీ కార్యాలయం అధికార ప్రతినిధి నఫీజ్‌ జకారియా పాక్‌లోని భారత హైకమిషనర్‌ గౌతమ్‌ బంబ్వాలేకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఈసారి జరిగే ద్వైపాక్షిక చర్చలు కశ్మీర్‌ ప్రధాన ఎజెండాగా సాగాలని కోరారు. సమకాలీన అంశాలను పక్కన పెట్టి ఇరు దేశాలకు చెందిన కశ్మీర్‌ సమస్యపై చర్చించాలని కోరారు.
కాగా, ద్వైపాక్షిక చర్చల పట్ల భారత్‌ సానుకూలంగానే ఉన్నప్పటికీ అవి సమకాలీన అంశాలకు సంబంధించినవే ఉండాలన్నది భారత్‌ వాదన. ఉగ్రవాదుల చొరబాట్లు, సరిహద్దు ఉగ్రవాదం వంటి అంశాలపైనే ఈ చర్చలు సాగాలన్నది భారత వైఖరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com