నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి వారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు దంపతులు
- August 04, 2026
తిరుపతి: తిరుపతి జిల్లా నాగలాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు.
దశావతారాల్లో తొలి అవతారమైన మత్స్యావతార స్వరూపుడు శ్రీ వేదనారాయణస్వామి వారికి ప్రత్యేక పూజల్లో పాల్గొని దేశ ప్రజల సుఖశాంతులు, సనాతన ధర్మాభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం,నరేష్ కూడా చైర్మన్‌తో కలిసి స్వామివారి సేవలో పాల్గొని దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ వేదనారాయణస్వామివారి క్షేత్ర మహిమ, ఆధ్యాత్మిక విశిష్టతను చైర్మన్‌కు వివరించారు. అనంతరం ఆలయ అధికారులు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను సమర్పించి సత్కరించారు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







