షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!

- August 05, 2026 , by Maagulf
షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!

కువైట్ : కువైట్‌లోని షేక్ జాబర్ బ్రిడ్జిపై నుంచి సముద్రంలోకి దూకిన ఓ మహిళను అగ్నిమాపక, మెరైన్ రెస్క్యూ బృందాలు సకాలంలో రక్షించాయి. మంగళవారం జరిగిన ఈ ఘటనలో మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది.

ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే అల్-జౌన్ మెరైన్ సెంటర్, షేక్ జాబర్ బ్రిడ్జ్ మెరైన్ ఫైర్ అండ్ రెస్క్యూ సెంటర్‌కు చెందిన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపింది.

సముద్రంలో పడిన మహిళను సురక్షితంగా బయటకు తీసి అత్యవసర వైద్య సిబ్బందికి అప్పగించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు, మహిళ వ్యక్తిగత వివరాలను అధికారులు వెల్లడించలేదు.

సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలను కాపాడిన అగ్నిమాపక, మెరైన్ రెస్క్యూ సిబ్బందిని జనరల్ ఫైర్ ఫోర్స్ అభినందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com