అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!

- August 05, 2026 , by Maagulf
అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!

రియాద్: సముద్ర తీరాలకు వెళ్లే ప్రజలు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ సూచించింది. అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లకుండా ఉండాలని, బీచ్‌ల వద్ద చిన్నారులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ప్రజల భద్రత కోసం అందుబాటులో ఉన్న సిబ్బంది, వనరులను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నట్లు బోర్డర్ గార్డ్ తెలిపింది. సముద్ర సెర్చ్ అండ్ రెస్క్యూ చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. అలాగే రక్షణ పడవలు, భద్రతా పరికరాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచడంతో పాటు సముద్రంలోకి బయలుదేరే ముందు అవసరమైన అన్ని అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించింది.

సముద్ర భద్రతా నిబంధనలు, అధికారుల సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని బోర్డర్ గార్డ్ మరోసారి విజ్ఞప్తి చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మక్కా, మదీనా, తూర్పు ప్రావిన్స్‌లలో 911, మిగతా సౌదీ ప్రాంతాల్లో 994 నంబర్లకు వెంటనే ఫోన్ చేసి సహాయం పొందాలని బోర్డర్ గార్డ్ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com