ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!

- August 05, 2026 , by Maagulf
ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!

మస్కట్: ఒమాన్‌లోని పలు తీర ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తక్కువ ఎత్తులో మేఘాలు, పొగమంచు(ఫాగ్) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

ఈ ప్రభావం ఒమాన్ సముద్ర తీర ప్రాంతాలతో పాటు దక్షిణ, తూర్పు, మధ్య ప్రాంతాల తీరప్రాంతాలు, ధోఫార్ గవర్నరేట్ తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ తగ్గే అవకాశం ఉన్నందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, నెమ్మదిగా ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com