దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- August 05, 2026
దుబాయ్: దుబాయ్ సౌత్ ప్రాంతంలో ఆగస్టు 4 రాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను దుబాయ్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. వర్క్‌షాప్‌లో జరిగిన ప్రమాదం కారణంగానే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఘటనలో పలు ట్రక్కులు, కారవాన్లు మంటల్లో దగ్ధమైనట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని, అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
సోమవారం అర్ధరాత్రి సమయంలో దుబాయ్ సౌత్ పరిసర ప్రాంతాల్లో భారీ శబ్దాలు వినిపించాయని, అనంతరం దట్టమైన నల్లటి పొగ ఆకాశంలోకి ఎగసిపోతుండటాన్ని స్థానికులు గమనించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, పోస్టులు సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రజలు అధికారిక వర్గాలు ధృవీకరించిన సమాచారాన్నే నమ్మాలని, సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చే అసత్య ప్రచారాలు, పుకార్లను వ్యాప్తి చేయవద్దని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేశారు.
పుకార్లు వ్యాప్తి చేస్తే కఠిన శిక్షలు
యూఏఈ చట్టాల ప్రకారం తప్పుడు వార్తలు, నిర్ధారణ లేని సమాచారం లేదా అధికారిక ప్రకటనలకు విరుద్ధంగా ఉండే పుకార్లను ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం శిక్షార్హమైన నేరం.
సంబంధిత చట్టంలోని ఆర్టికల్ 52 ప్రకారం, తప్పుడు వార్తలు లేదా పుకార్లు ప్రచారం చేసిన వారికి కనీసం ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు Dh100,000 జరిమానా విధించే అవకాశం ఉంది.
అలాగే, సంక్షోభాలు, విపత్తుల సమయంలో ప్రజల్లో భయాందోళనలు లేదా ప్రభుత్వ సంస్థలపై వ్యతిరేక భావనలు రెచ్చగొట్టే విధంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే, కనీసం రెండేళ్ల జైలు శిక్షతో పాటు Dh200,000 జరిమానా విధించే నిబంధనలు అమల్లో ఉన్నాయని అధికారులు మరోసారి హెచ్చరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







