మోటరిస్టులకు 264 వార్నింగ్స్‌

- August 15, 2016 , by Maagulf
మోటరిస్టులకు 264 వార్నింగ్స్‌

మోటరిస్టులకు 264 వార్నింగ్స్‌ని అబుదాబీ మునిసిపాలిటీ జారీ చేసింది. తమ వాహనాల్ని ఎక్కువసేపు పబ్లిక్‌ స్పేసెస్‌పై నిబంధనలకు విరుద్ధంగా నిలిపివేసినందుకుగాను ఈ వార్నింగ్స్‌ జారీ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఆగస్ట్‌ 15న ఈ మేరకు వార్నింగ్స్‌ని జారీ చేశారు. ఐదు రోజుల ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా నిబంధనల ఉల్లంఘనల్ని అధికారులు గుర్తించారు. వాహనదారులు, క్యాపిటల్‌లో ఎక్కడబడితే అక్కడ డర్టీ వెహికిల్స్‌, ట్రైలర్స్‌ మరియు బోట్స్‌ని పార్కింగ్‌ లాట్స్‌, ఓపెన్‌ పబ్లిక్‌ ఏరియాస్‌లో విడిచిపెట్టడానికి వీల్లేదు. ఒక్కసారి నోటీసు జారీ అయ్యాక మూడు రోజులపాటు ఆయా వాహనాల్ని అధికారులు పరిశీలిస్తారు. క్లీన్‌ చేయడం లేదా తొలగించడం చేయకపోతే, ఆ వాహనాన్ని అక్కడి నుంచి లిఫ్ట్‌ చేస్తారు. ఆ తరువాత తగిన జరీమానా విధించిన తర్వాతనే వాహనదారులకు ఆ వాహనాల్ని అప్పగిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com