రియో ఒలింపిక్స్ లో సింధు సంచలనo
- August 15, 2016
రియో ఒలింపిక్స్ లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సంచలన విజయం సాధించింది. మహిళల సింగిల్స్ విభాగంలో తన కంటే ఎంతో మెరుగైన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ ఝు యింగ్ పై సింధు గెలిచి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున జరిగిన పోరులో సింధు 21-13, 15-21 తేడాతో ఝు యింగ్ ఓడించి క్వార్టర్స్ కు చేరింది.ఈ మ్యాచ్ కు ముందు వరకూ వీరిద్దరి ముఖాముఖి పోరులో యింగ్ 4-2తో ముందంజంలో ఉంది. దీంతో యింగ్ నే మ్యాచ్ ఫేవరెట్ గా పరిగణించగా, సింధు మాత్రం అంచనాలను తారుమారు చేస్తూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆద్యంతం దూకుడును కనబరిచిన సింధు.. తొలి గేమ్ ను అవలీలగా గెలుచుకుంది. అయితే రెండో గేమ్ లో యింగ్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా చివరకు సింధునే పైచేయి సాధించింది. వరుస రెండు గేమ్ ల్లో ఏకపక్ష విజయం సాధించిన సింధు పదునైన స్మాష్ లతో అలరించి నాకౌట్ పోరుకు సిద్ధమైంది. దీంతో క్వార్టర్స్ లో చైనా క్రీడాకారిణి, ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ యిహాన్ తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. అంతకుముందు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







