మతపరమైన గొడవలకు దారి
- August 16, 2016
నగరంలోని పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. శాలిబండ ఎంఐఎం కార్పొరేటర్ము జఫర్ ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. 2012 చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయ వివాదం కేసులో ముజఫర్ ఏ2 నిందితుడిగా ఉన్నారు. గతంలో ఆలయం వద్ద ఉన్న షెడ్డును తొలగించే క్రమంలో చార్మినార్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. మతపరమైన గొడవలకు దారి తీసిందన్న ఉద్దేశంతో అప్పట్లో పోలీసులు ముజఫర్‌పై చర్యలకు సిద్ధమయ్యారు.
కాగా అప్పటి నుంచి ముజఫర్ తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో కేసును పోలీసులు సిట్ అధికారులకు అప్పగించారు. విచారణలో భాగంగా ఏ1 నిందితుడిని ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేశారు. ఏ2 నిందితుడిగా ఉన్న ముజఫర్‌ను పట్టుకునే క్రమంలో ఇంటికి వెళ్లగా అతడు లేకపోవడంతో ఇతరులను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముజఫర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తామని సిట్ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







