పాకిస్థాన్ జట్టుపై స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ జరిమానా
- August 16, 2016
ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించిన పాకిస్థాన్ జట్టుపై స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ జరిమానా విధించింది. ఆదివారం ముగిసిన నాలుగో టెస్టులో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ టెస్టులో నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే పాకిస్థాన్ ఒక ఓవర్ తక్కువగా వేసినట్లు మ్యాచ్ రిఫరీ రిచర్డ్‌సన్ తేల్చారు. దీంతో ఐసీసీ నియమావళి ప్రకారం కెప్టెన్ మిస్బావుల్ హక్ మ్యాచ్ ఫీజులో 20 శాతం, జట్టులోని మిగతా ఆటగాళ్లకి 10 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఏడాదిలోపు పాకిస్థాన్ మరోసారి ఇలా స్లో ఓవర్ రేట్ తప్పిదం చేస్తే కెప్టెన్ మిస్బావుల్ హక్‌పై సస్పెన్షన్ వేటు పడే ప్రమాదం ఉంటుంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







