ఒక్క ఫోన్‌ కాల్‌తో వేస్ట్‌ పికప్‌

- August 16, 2016 , by Maagulf
ఒక్క ఫోన్‌ కాల్‌తో వేస్ట్‌ పికప్‌

చెత్తను తరలించేందుకుగాను 24 గంటల కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ని ఉర్‌బాసర్‌ ప్రారంభించింది. ఆగస్ట్‌ 1 నుంచి ఈ సంస్థ తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. నార్తరన్‌ మరియు సదరన్‌ మునిసిపాలిటీస్‌కి చెందిన వినియోగదారులు, ఉర్బాసర్‌ని కస్టమర్‌ కేర్‌ లైన్‌ 80070000ని సంప్రదించవచ్చు. బల్క్‌ వేస్టేజ్‌ అలాగే గ్రీన్‌ వేస్ట్‌ పికప్‌ కూడా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉర్బాసర్‌ బహ్రెయిన్‌ జనరల్‌ మేనేజర్‌ లూయిస్‌ డి లా కాంపా మాట్లాడుతూ, కాల్‌ సెంటర్‌, పౌరులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందనీ, అలాగే వినియోగదారుల ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా తమ సర్వీసుల్ని మరింత మెరుగ్గా అందిస్తామని తెలిపారు. ఉర్‌బాసర్‌ ఇదే తరహాలో సేవల్ని స్పెయిన్‌, ఫ్రాన్స్‌, యూకే, అర్జెంటీనా మరియు ఒమెన్‌లో అందిస్తూ, విజయవంతంగా నడుస్తోందని చెప్పారు కంపా. ఒమన్‌లో ప్రతిరోజూ 350 కాల్స్‌తో తమ సంస్థ సేవలు అందిస్తోందనీ, ప్రారంభమైన తొలి నెలలోనే ఇది సాధ్యమయ్యిందని కంపా వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com