బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- August 14, 2026
మనామా: మ్యారేజ్ సర్టిఫికెట్ పొందే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ బహ్రెయిన్ న్యాయ, ఇస్లామిక్ వ్యవహారాలు, వక్ఫ్ మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై అధికారిక మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన జంటలకు రెండు పని దినాల్లోనే సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియకు మూడు పని దినాలు పట్టగా.. తాజా మార్పులతో ఆ సమయాన్ని ఒక రోజుకు తగ్గించారు. అంతేకాకుండా మొత్తం ప్రక్రియను డిజిటల్ విధానంలోనే పూర్తి చేసేలా సేవలను అప్గ్రేడ్ చేసినట్లు మంత్రిత్వ శాఖకు చెందిన అండర్ సెక్రటరీ డానా ఖమీస్ అల్ జయానీ తెలిపారు. అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్యను కూడా 50 శాతం తగ్గించినట్లు పేర్కొన్నారు. వివాహ ఒప్పందాన్ని సంబంధిత షరియా కోర్టు ధ్రువీకరించిన వెంటనే.. అధికారిక ఎలక్ట్రానిక్ మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ అయినట్లు భార్యాభర్తలిద్దరికీ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుందన్నారు. అవసరమైతే సర్టిఫికెట్ ప్రింటెడ్ కాపీని కూడా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు
డిజిటల్ సేవలపై ప్రత్యేక ఫోకస్
ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడంతో పాటు.. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చేపడుతున్న డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు డానా ఖమీస్ అల్ జయానీ తెలిపారు. ఇప్పటికే 1,300కు పైగా ప్రభుత్వ సేవలను డాక్యుమెంట్ చేసి, అనువదించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో 800 సేవలను వివిధ ప్రభుత్వ శాఖల్లో అభివృద్ధి చేసి, పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, జాతీయ తవాసుల్ వ్యవస్థ ద్వారా అందిన ఫిర్యాదులు, పెట్టుబడిదారుల అభిప్రాయాలు, ప్రభుత్వ సేవలను రహస్యంగా పరిశీలించే ‘మిస్టరీ షాపర్’ నివేదికలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు చేస్తున్నట్లు డానా ఖమీస్ అల్ జయానీ వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!







