మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా.. ఫస్ట్ లుక్ రిలీజ్..
- August 14, 2026
శ్రీహరి కొడుకు మేఘాంశ్ శ్రీహరి గతంలో రాజ్ దూత్, కోతికొమ్మచ్చి అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యాడు మేఘాంశ్. ఇటీవలే స్టూడెంట్ అనే ఓ సినిమా టీజర్ రిలీజ్ చేసాడు. ఆస్మాన్ అనే ఓ కొత్త సినిమా ఓపెనింగ్ చేసాడు. తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించాడు మేఘాంశ్ శ్రీహరి.
మేఘాంశ్ శ్రీహరి హీరోగా భైరవకాళి బ్యానర్‌లో కొత్త సినిమా తెరకెక్కుతుంది. లెల్లా రోహిత్ దర్శకత్వంలో లెల్లా రాహుల్ నిర్మాణంలో ఈ సినిమా రానుంది. రేపు ఆగస్టు 15 శ్రీహరి పుట్టినరోజు కావడంతో ఆయన పుట్టిన రోజు సందర్భంగా నేడు మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
ఈ ఫస్ట్ లుక్ లో తెలంగాణ సంస్కృతిలో భాగమైన పోతురాజు ఆహార్యంలో మేఘాంశ్ శ్రీహరి ఉన్నాడు. మేఘాంశ్ వెనుక పోతురాజు ఆహార్యంలో శ్రీహరి కూడా ఉండటం గమనార్హం. పవర్‌ఫుల్ లుక్స్ తో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







