కొరటాల శివ కొత్త సినిమా అఖిల్ అక్కినేనితో..

- August 16, 2016 , by Maagulf
కొరటాల శివ కొత్త సినిమా అఖిల్ అక్కినేనితో..

రచయిత నుంచి దర్శకుడిగా మారిన కొరటాల శివ ప్రభాస్ తో మిర్చి, మహేష్ బాబు తో శ్రీమంతుడు వంటి సూపర్ హిట్ సినిమాలను అందించాడు. టాలీవుడ్ దర్శకుల్లో స్టార్ దర్శకుడిగా మారిన కొరటాల శివ మూడో సినిమాగా ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగా హీరో రామ్ చరణ్ తో చేయబోతున్నట్లు వార్తలు అప్పట్లో వినిపించాయి.. అనంతరం మహేష్ బాబు తో అని కూడా వార్తలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలతో కాదు కొరటాల శివ కొత్త సినిమా అఖిల్ అక్కినేనితో అనే టాక్ వినిపిస్తోంది. అఖిల్ సెకండ్ సినిమాపై గత కొన్ని నెలలుగా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా అఖిల్ సెకండ్ సినిమా శివ నాలుగో సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో ఉండనున్నదని.. తెలుస్తోంది.. రామ్ చరణ్ తో కొరటాల శివ సినిమా చేయాల్సి ఉంది.. కానీ చరణ్ ప్రసుతం ధృవ తో.. నెక్స్ట్ సుకుమార్ తో సినిమా ప్లాన్ లో ఉన్నాడు.. ఈ సమయంలో కొరటాల శివ అఖిల్ తో సినిమా పూర్తి చేసి నెక్స్ట్ రామ్ చరణ్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు. అనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది.. ఈ వార్తల్లో ఎంత నిజముందో... తెలియాలంటే అఖిల్ శివ ల సినిమాపై అధికారిక ప్రకటన వెలువడాల్సిందే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com