నాగబాబుకు కీలక పదవి.. గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం..
- August 17, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు(Nagababu) బాధ్యతాయుతమైన పదవి దక్కింది. రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ నాగబాబును ఆంధ్రప్రదేశ్ ‘గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ’ ఛైర్మన్‌గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా:
ఈ నియామకంతో రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడం, అటవీ విస్తీర్ణం పెంపు, పర్యావరణ సమతుల్యత కాపాడటంలో నాగబాబు కీలక పాత్ర పోషించనున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు హరిత ప్రాజెక్టుల అమలును ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
ముందుకు సాగనున్న హరిత ప్రాజెక్టులు:
నాగబాబు నియామకంపై పార్టీ శ్రేణులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పర్యావరణ హిత విధానాలను బలోపేతం చేసేందుకు, సరికొత్త గ్రీన్ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా స్పష్టమవుతోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







