సముద్రంలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించిన బోర్డర్ గార్డ్..!!

- August 17, 2026 , by Maagulf
సముద్రంలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించిన బోర్డర్ గార్డ్..!!

యాన్‌బు: సముద్రంలో పడవ మొరాయించడంతో చిక్కుకుపోయిన ఐదుగురు సౌదీ పౌరులను బోర్డర్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. మదీనా ప్రాంతంలోని యాన్‌బు గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పడవ సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అందులో ఉన్న ఐదుగురు పౌరులు సహాయం కోసం కాల్ చేశారు. సమాచారం అందుకున్న బోర్డర్ గార్డ్‌కు చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి.

సముద్రంలోకి వెళ్లే ముందు తమ పడవలు ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ సూచించింది. సముద్ర భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలు, సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ధరించాలని కోరింది.

సముద్రంలో అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న వారు సహాయం కోసం మక్కా, మదీనా, తూర్పు ప్రావిన్స్‌లలో 911కు.. మిగిలిన ప్రాంతాల్లో అత్యవసర సహాయం కోసం 994కు ఫోన్ చేయాలని బోర్డర్ గార్డ్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com