ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు BD15 ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ప్రతిపాదన..!!

- August 17, 2026 , by Maagulf
ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు BD15 ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ప్రతిపాదన..!!

మనామా: బహ్రెయిన్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ప్రయాణ ఖర్చుల భారం తగ్గించేందుకు కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఉద్యోగులకు నెలకు కనీసం BD15 ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అందించేలా కార్మిక చట్టంలో సవరణ చేయాలని ఎంపీ జలాల్ కాధెమ్ ప్రతిపాదించారు.

ప్రైవేట్ సంస్థ ఇప్పటికే ఉద్యోగులకు ఇంటి నుంచి కార్యాలయానికి, తిరిగి ఇంటికి రవాణా సౌకర్యం కల్పిస్తే ఈ అలవెన్స్ వర్తించదు. మిగతా ఉద్యోగులకు నెలకు కనీసం BD15 చెల్లించేలా చట్టాన్ని సవరించాలని ఆయన కోరారు.

ప్రైవేట్ రంగ ఉద్యోగులు పెరుగుతున్న ఇంధనం, ప్రయాణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్నారని కాధెమ్ పేర్కొన్నారు. చాలా సంవత్సరాలుగా ప్రైవేట్ ఉద్యోగుల వేతనాల్లో పెద్దగా మార్పు లేకపోవడంతో.. రవాణా ఖర్చులు వారి కుటుంబ బడ్జెట్‌పై అదనపు భారంగా మారాయని తెలిపారు. ప్రస్తుత 2012లోని లా నంబర్ 36లోని ఆర్టికల్ 10కు సవరణలు చేయాలని ఆయన ప్రతిపాదించారు.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు

ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కనీసం BD20 ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ లభిస్తోందని కాధెమ్ తెలిపారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు BD15 ఇవ్వడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల మధ్య ప్రయోజనాల వ్యత్యాసాన్ని కొంతవరకు తగ్గించవచ్చన్నారు. ఈ అలవెన్స్ వల్ల ఉద్యోగుల ప్రాథమిక వేతనం కుటుంబ అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడుతుందని, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు బహ్రెయిన్ పౌరులకు మరింత ఆకర్షణీయంగా మారుతాయని పేర్కొన్నారు.

 ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు యజమానులు తగిన రవాణా సౌకర్యం కల్పించాల్సిన నిబంధన ఉంది. ప్రతిపాదిత సవరణలో ఈ బాధ్యతను కొనసాగిస్తూనే.. సంస్థ నుంచి రవాణా సౌకర్యం పొందని ఉద్యోగులకు BD15 నెలవారీ అలవెన్స్ చెల్లించేలా నిబంధన తీసుకురావాలని కాధెమ్ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com