కువైట్‌లో పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల విక్రయంపై ఆంక్షలు..!!
- August 17, 2026
కువైట్ : 21 ఏళ్లలోపు వారికి పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను విక్రయించడాన్ని కువైట్ ప్రభుత్వం నిషేధించింది. ప్రజారోగ్యాన్ని కాపాడటం, పొగాకు, నికోటిన్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక నష్టాలను తగ్గించడమే లక్ష్యంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మేరకు కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవధీ మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ 237 ఆఫ్ 2026ను జారీ చేశారు. దీని ప్రకారం.. సిగరెట్లు, ఈ-సిగరెట్లు, హీటెడ్ టొబాకో ఉత్పత్తులు, నికోటిన్ లిక్విడ్లు, కార్ట్రిడ్జ్‌లు, నికోటిన్ పౌచ్‌లు, పొగలేని పొగాకు తదితర ఉత్పత్తుల విక్రయంపై కొత్త ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
అలాగే, కిరాణా దుకాణాలు, మొబైల్ కార్టులు, కియోస్క్‌లు, వెండింగ్ మెషీన్లు, ఎగ్జిబిషన్లు, వినోద కార్యక్రమాల్లో వీటి విక్రయాన్ని నిషేధించారు. వీటితోపాటు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ సంస్థలు, స్పోర్ట్స్ క్లబ్‌లు, యువజన కేంద్రాలు, సినిమా థియేటర్లు, పిల్లలు, యువతకు సంబంధించిన కేంద్రాల్లో వీటి విక్రయాలు, ప్రదర్శనపై కూడా నిషేధం ఉంటుంది.
వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, సోషల్ మీడియా, డెలివరీ సేవల ద్వారా విక్రయించడంపైనా ఆంక్షలు విధించారు. విద్యా సంస్థలకు 200 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాల్లో కూడా వీటి విక్రయాన్ని నిషేధించారు.
కో-ఆపరేటివ్ సొసైటీలు, ఇతర మార్కెట్లలో విక్రయించే నికోటిన్ ఉత్పత్తులను ప్రత్యేకంగా కేటాయించిన, పర్యవేక్షణలో ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ప్రదర్శించాలి. ప్రతి ఉత్పత్తి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వద్ద రిజిస్టర్ అయి, అనుమతి పొందాలి. అలాగే నిర్దేశిత భద్రతా ప్రమాణాలను పాటించడంతో పాటు.. ప్యాకెట్ ముందు భాగంలో కనీసం 50 శాతం స్థలంలో ఆరోగ్య హెచ్చరికలు ఉండాలి.
ప్రకటనలు, డిస్కౌంట్లపైనా నిషేధం
పొగాకు, నికోటిన్ ఉత్పత్తులకు ప్రకటనలు ఇవ్వడం, ప్రచారం చేయడం, స్పాన్సర్ చేయడం, ఉచిత నమూనాలు పంపిణీ చేయడం, బహుమతులు ఇవ్వడం, డిస్కౌంట్లు ప్రకటించడాన్ని కూడా నిషేధించారు. అదేవిధంగా ఈ-సిగరెట్లు, హీటెడ్ టొబాకో ఉత్పత్తులను స్మోకింగ్ నిషేధించిన ప్రదేశాల్లో సిగరెట్లతో సమానంగా పరిగణిస్తారు. కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నిబంధనల అమలును ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాలు పర్యవేక్షించనున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రమాద బాధితుల ఫొటోలు తీస్తే జైలు.. QR10,000 వరకు ఫైన్..!!
- నేటితో అమెరికా-ఇరాన్ 60 రోజుల ఒప్పందం పూర్తి
- ఒమన్‌లో టెలికాం ప్రమోషనల్ మెసేజ్‌లపై ఆంక్షలు..!!
- నాగబాబుకు కీలక పదవి.. గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియామకం..
- విశాఖపట్నం టు భోగాపురం ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం..
- దుబాయ్‌లో అద్దె చెల్లింపులకు ఇక లోన్లు అవసరం లేదు.. నెలవారీగా చెల్లించే అవకాశం..!!
- కువైట్‌లో పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల విక్రయంపై ఆంక్షలు..!!
- ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు BD15 ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ప్రతిపాదన..!!
- సముద్రంలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించిన బోర్డర్ గార్డ్..!!
- యాదగిరిగుట్ట భక్తులకు గుడ్ న్యూస్







