పూర్తి కావొస్తున్న 'గల్ఫ్' మూవీ
- August 17, 2016
విలక్షణ దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం 'గల్ఫ్'. ఈ సినిమాతో గల్ఫ్‌లో తెలుగువారు పడుతున్న వెతల్ని దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి ఎంతో హృద్యంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతానికి చిత్ర షూటింగ్ 80 శాతం పైగా పూర్తయ్యింది. మిగిలిన 20శాతం షూటింగ్ సెప్టెంబర్ నాటికి పూర్తి చేయనున్నారట. కొత్త షెడ్యూల్‌ని గల్ఫ్‌లోని రస్ అల్ ఖైమా,అజ్మన్ తదితర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. కొత్త నటీనటులతో సునీల్‌కుమార్‌రెడ్డి చేస్తున్న ఈ చిత్రం పట్ల సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అలాగే, ఏ సినిమా తీసినా, అందులో మంచి పాయింట్‌ని ప్రస్తావిస్తూ, సమాజాన్ని మేలు కొలిపే సునీల్ కుమార్‌రెడ్డి, గల్ఫ్ దేశాల్లోని వెతల్ని 'గల్ఫ్' మూవీతో చూపిస్తూనే, అక్కడికి వెళ్ళేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయనున్నారట. 20 శాతం షూటింగ్ పూర్తయ్యాక, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ వివరాలు మాగల్ఫ్.కామ్ కు తెలియజేసారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







