ఆపిల్‌ మాక్‌ యూజర్లకు సైబర్‌ అలర్ట్‌..!!

- August 21, 2026 , by Maagulf
ఆపిల్‌ మాక్‌ యూజర్లకు సైబర్‌ అలర్ట్‌..!!

దోహా: ఆపిల్‌ మాక్‌ వినియోగదారులకు ఖతార్‌ జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) కీలక హెచ్చరిక జారీ చేసింది. మాకోస్‌లోని Screen Sharing ఫీచర్‌లో ఉన్న హై-రిస్క్‌ భద్రతా లోపాన్ని సైబర్‌ నేరగాళ్లు చురుగ్గా దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్‌కు నేరుగా కనెక్ట్‌ అయి ఉన్న పరికరాలపై ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు NCSA పేర్కొంది.

ఈ లోపాన్ని ఉపయోగించుకుని దాడి చేసేవారు మాక్‌లో రూట్‌-లెవల్‌ యాక్సెస్‌ పొందుతున్నట్లు వెల్లడించింది. అనంతరం మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసి, బాధిత పరికరాల కంప్యూటింగ్‌ వనరులను ఉపయోగించి క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మాకోస్‌ వినియోగదారులు తమ పరికరాలను తక్షణమే తాజా సెక్యూరిటీ వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలని NCSA సూచించింది. అవసరం లేని సమయంలో Screen Sharing ఫీచర్‌ను డిసేబుల్‌ చేయాలని కోరింది.

ప్రభావితమయ్యే వెర్షన్లు
* macOS Tahoe: 26.6.1 కంటే ముందు వెర్షన్లు
* macOS Sequoia: 15.7.9 కంటే ముందు వెర్షన్లు
* macOS Sonoma: 14.8.9 కంటే ముందు వెర్షన్లు

మాక్‌ యూజర్లు తమ సిస్టమ్‌ వెర్షన్‌ను పరిశీలించి, అందుబాటులో ఉన్న తాజా సెక్యూరిటీ అప్‌డేట్‌ను వెంటనే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com